calender_icon.png 26 January, 2026 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.6.75 కోట్ల అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే

26-01-2026 02:41:49 AM

షాద్‌నగర్ జనవరి 25, (విజయక్రాంతి): షాద్‌నగర్ మున్సిపాలిటీ లో వార్డుల వారీగా ప్రాధాన్యత పద్ధతిలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్‌నగర్‌లో రూ.6.75 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  సీసీ రోడ్లు, అంతర్గత కాలువల పనులు ఇందులో ఉన్నాయి. పట్టణంలోని 27వ వార్డులో రూ. 60 లక్షలు, 15వ వార్డులో 25 లక్షలు,

నాలుగవ వార్డులో 50 లక్షలు, 18వ వార్డులో 50 లక్షలు, 17వ వార్డులో 25 లక్షలు, 19వ వార్డులో 25 లక్షలు, ఏడవ వార్డులో కోటి రూపాయలు, 8వ వార్డులో 40 లక్షలు, పదవ వార్డులో కోటి రూపాయలు, ఒకటో వార్డులో 50 లక్షలు వెచ్చించి,  కీర్తి అపార్ట్మెంట్ సమీపంలో అంతర్గత కాలువ నిర్మాణానికి కోటి 50 లక్షల తో పనిలకు శంకుస్థాపన చేసారు. శంకుస్థాపన సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ ఎన్నికలకు ముందే మున్సిపాలిటీ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని తాను హామీ ఇచ్చానని, ఇచ్చిన హామీ ప్రకారం ఈ పనులు చేపడుతున్నానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమ్ లో ఆయా వార్డుల మాజీ కౌన్సిలర్లు, ఆశావాహులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.