calender_icon.png 21 May, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిషన్‌రెడ్డీ.. చిల్లర రాజకీయాలు వద్దు

21-05-2025 12:07:16 AM

  1. దేశభక్తి అనేది కాంగ్రెస్ కల్చర్‌లోనే ఉంది 
  2. రాహుల్‌గాంధీపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకో 
  3. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విమర్శించారు. ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్‌యాదవ్‌తో కలిసి మాట్లా డారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన గాంధీ కుటుంబంపై కిషన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సరికాదని హిత వుపలికారు.

దేశభక్తి అనేది కాంగ్రెస్ కల్చర్‌లోనే ఉందనే విష యం తెలుసుకోవాలని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశానికి జరిగిన నష్టంమెంతో చెప్పాలని రాహుల్‌గాంధీ అడిగితే దేశ వ్యతిరేకి అవుతారా? అని మండిపడ్డారు. దేశం కోసం గాంధీ కుటుంబమే ప్రా ణత్యాగం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టంచేశారు.

రాహుల్‌గాంధీపై చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టే ఆలోచన కిషన్‌రెడ్డి చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌లో పా ల్గొన్న సైనికులపై చిల్లర కామెంట్స్ చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని తెలిపారు. కిషన్‌రెడ్డికి చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి అదనంగా నిధులు తీసుకురావాలని హితవుపలికారు.