23-10-2025 12:35:20 AM
-డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తర్జనభర్జన
-ముగ్గురు పేర్లు ఢిల్లీకి పంపిన అధిష్టానం
-పలుకుబడి ఉన్న నేతలకు అడ్డొస్తున్న నిబంధనలు
-సామాజిక సమీకరణపై పార్టీ దృష్టి
-బీసీ నేతలకు ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్
నిర్మల్, అక్టోబర్(విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో చేతి పగ్గాలను చేజిక్కించుకునేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీల ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈనెల 25 లోపు తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో డిసిసి అధ్యక్షులు నియామకానికి క్షేత్రస్థాయిలో కొసరత్తు పూర్తి కావ డంతో ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాజకీయ చైతన్య ఉన్న నిర్మల్ జిల్లాలో అధ్యక్ష పదవికి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం అందులో సీనియర్ నేతల ఉండడంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న అంశంపై జిల్లా కాంగ్రెస్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కే శ్రీహరిరావు డిసిసి అధ్యక్షు నిగా రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసిసి అధ్యక్ష పదవి చేపట్టిన శ్రీహరి రావు కాంగ్రెస్ జిల్లా బాధితు లను కూడా నిర్వర్తిస్తూ వస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏఐసీసీ డిసిసి అధ్యక్షులు ఎంపికకు షెడ్యూల్‌ని ప్రకటించి వారం రోజు ల క్రితం నిర్మల్ జిల్లాలో ఏఐసిసి పరిశీలకులు జిల్లా ఇన్చార్జిల సమక్షంలో దరఖాస్తు లు స్వీకరించి అభిప్రాయాలను తీసుకున్నా రు. కర్ణాటక చెందిన మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్‌సింగ్ నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం బ్లాక్ స్థాయి సమావేశాలు నిర్వహించి బీసీసీ అధ్యక్షుని ఎంపికపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు
పోటీ తీవ్రం నిబంధనలు కఠినం
అఖిలభారత కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షు లు ఎంపిక విషయంలో ఈసారి పారదర్శకత పద్ధతిలో ఎంపికకు శ్రీకారం చుట్టింది. రాజకీయ ప్రాబల్యం ఉన్న నేతలకు కాకుండా ప్రజలతో సంబంధాలు ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ఈ నాయకుడిని అయినా డీసీసీ అధ్యక్షులు ఎంపిక చేసుకోవచ్చని సూచించింది. నిర్మల్ జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవి కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు తో పాటు సీనియర్ నాయకులైన పత్తిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అల్లూరి కృష్ణావేని, దశరథం రాజేశ్వర్, గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మత్ అలీ, అనుముల భాస్కర్, ముడుసు సత్యనారాయణ, గంగారెడ్డి, ఆనందరావు పటేల్, రాజుర సత్యం తదితర సీనియర్ నాయకులతో పాటు జూనియర్ నాయకులు కూడా ఉన్నారు.
అయితే డిసిసి అధ్యక్షులు ఎన్నికలు పేర్ల కసరత్తు పూర్తి అయి ముగ్గురు పేర్లను ఢిల్లీకి పంపినట్టు ప్రచారం జరుగుతుంది ఇందులో అయితే డిసిసి డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు, గ్రంథాలయ చైర్మన్ అర్జుమత్ అలీ, సీనియర్ నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఐదు సంవత్సరాలుగా పనిచేసే ఉం డాలని ఒకరికి ఒక పదవి ఇవ్వాలని ప్రజల అభిప్రాయం మీదకి ఎంపిక బాధితులు చేపట్టాలని రాజకీయ లాబింగ్లకు దూరంగా ఉంటూ జిల్లాలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయాలని రాష్ట్ర పరిశీలకులను ఆదేశించింది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 15 మందిపైగా 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి అధికంగా ఉన్నారు.
ఇందులో కాంగ్రెస్ పార్టీలో గ్రంథాలయ చైర్మన్ అర్జుమాత్ అలీ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు దశర థం రాజేశ్వర్ బైంసాకు చెందిన మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పార్టీలతో పాటు మరో నలుగురు ఉంటారని పార్టీ నేత లు చెప్తున్నారు. అయితే జిల్లాలో రాజకీయ చైతన్యం అందర్నీ కలుపుకుపోయే నేతలు ప్రజలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకొని డిసిసి అధ్యక్షుని ఎంపిక నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతుంది. డిసిసి అధ్యక్షుని ఎంపికకు తన పేరు కూడా పరిశీలిం చాలని రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురా లు కృష్ణవేణి కూడా దరఖాస్తు చేసుకున్నారు.
ఎవరికి వారే పదవి లాబీయింగ్
నిర్మల్ జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవి చేపట్టేందుకు జిల్లాలోని ముఖ్య నేతలంతా కూడా తమ రాజకీయ పలుకుబడితో ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం చేసిన కార్యక్రమాలు రాజకీయ ప్రాబల్యం సీనియర్ నేత రాజకీయ అనుభవం తదితర అంశాలను వివరిస్తూ డిసిసి అధ్యక్ష పదవిని తమకే కేటాయించాలని రాష్ట్ర అధిష్టానం పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ నటరాజన్ మీనన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ గౌరవ సలహాదారు కే కేశవరావు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు వంటి సీనియర్ నేతలతో ఇక్కడ నేతలు డిసిసి అధ్యక్షుని ఎంపిక కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో నిర్మల్ ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాలు ఉండగా మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య గ్రూపు వివరాలు చాప కింద నీరుల ఉండడంవల్ల డిసిసి అధ్యక్షులు ఎంపిక విషయంలో తమవారికి అవకాశం ఇవ్వాలని ఎవరికి వారి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
పార్టీ కార్యక్రమంలో మాత్రం డిసిసి పదవి ఎవరికి ఇచ్చిన కలిసి పని చేస్తామని చెప్తూనే క్షేత్రస్థాయిలో మాత్రం తమ వర్గానికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో డిసిసి అధ్యక్షుని ఎంపికపై తర్జన భర్జన జరుగుతుంది అయితే ఈసారి ఖానాపూర్ కూడా అవకాశం ఇవ్వాలని అక్కడ ఎమ్మెల్యే కోరినట్లు తెలుస్తోంది. ఏదేమైనా నిర్మల్ జిల్లాలో డిసిసి అధ్యక్షుని ఎంపిక పార్టీకి పెను సవాలుగా నిలవనున్నట్టు రాజకీయ చర్చ జరుగుతుంది.
బీసీ వర్గానికి ప్రాధాన్యత..?
నిర్మల్ జిల్లాలో గత కొన్ని రోజులుగా డీసీసీ అధ్యక్ష పదవిని ఓసి సామాజిక వర్గానికి కేటాయిస్తున్నందున ఈసారి బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమా ర్‌గౌడ్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతు న్న నేపథ్యంలో డిసిసి అధ్యక్షులు ఎంపికలు కూడా బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ నేతలు కోరినట్లు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సామాజిక సమీకరణల నేపథ్యంలో డిసిసి అధ్యక్షుని ఎంపిక ముడిపై ఉన్నందున రాష్ట్ర అధిష్టానం ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గానికి కేటాయించాలని తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మాజీ మంత్రులైన వేణుగోపాలచారి ఏ ఇంద్రకరణ్‌రెడ్డి, గడ్డం వినోద్ కుమార్ ప్రస్తుత మంత్రి వివేక్ వెంకటస్వామి తో పాటు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా తీసుకొని డిసిసి అధ్యక్షుని ఎంపిక చేసే విధంగా పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటివరకు నిర్మల్ జిల్లా లో డిసిసి అధ్యక్ష పదవి బీసీ వర్గానికి పోవడానికి ఇతర వర్గాల ఆధిపత్యమేనని ఈసారి తమకు తప్పకుండా అవకాశం కల్పిస్తారని బీసీ నేతలు ఎదురుచూస్తున్నారు