calender_icon.png 23 October, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్

23-10-2025 12:37:11 AM

చెన్నూర్, అక్టోబర్ 22:మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త దగాం శ్రీశైలం ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందగా బుధ వారం సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులను కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీశైలం పార్థివదేహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. పార్టీకి అంకితభావంతో సేవలందించిన శ్రీశైలం మరణం కాంగ్రెస్ కుటుం బానికి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తా మని హామీ ఇచ్చారు. ఇటివల కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోటపల్లి మండలంలోని అన్నారం విద్యార్థి నదిమొద్దీన్ కుటుంబ సభ్యులను కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.