19-11-2024 12:00:00 AM
ఖో ఖో ప్రపంచకప్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న తొలి ఖో ఖో వరల్డ్ ప్‌కు భారత్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా టోర్నీ నిర్వహణలో భాగంగా ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇం డియా (కేకేఎఫ్‌ఐ) భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ)తో జత కట్టింది. జనవరి 13 నుంచి 19 వర కు జరగనున్న టోర్నీని ఈ రెండు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
వరల్డ్‌కప్‌లో పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగనున్నా యి. మొత్తం 25 దేశాలు పోటీలో ఉన్నాయి. ఆసియా ఖండం నుంచి ఆతిథ్య భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ బరిలో ఉన్నాయి. ఘనా, కెన్యా, ఇంగ్లండ్, జర్మనీ, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు తొలిసారి టోర్నీలో బరిలోకి దిగుతున్నాయి.