19-11-2024 12:00:00 AM
చైనా మాస్టర్స్
షెంజెన్ (చైనా): భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ శెట్టి సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో ఈ జంట బరిలోకి దిగనుంది. సాత్విక్ జోడీ తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన యాంగ్ సుయాన్-లీ హుయె జంటతో ఆడనుంది. సింగిల్స్‌లో పీవీ సింధుతో పాటు ఆకర్షి కశ్యప్, మాళవిక బన్సోద్ బరిలో ఉన్నారు. పురుషుల విభాగంలో లక్ష్యసేన్, మహిళల డబుల్స్‌లో గాయత్రి-త్రిసా జాలీ జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్-సిక్కిరెడ్డి జోడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.