19-11-2024 12:00:00 AM
సెమీస్‌లో భారత్, జపాన్ ఢీ
రాజ్‌గిర్: మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో జోరు మీదున్న భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టేందుకు తహతహలాడుతోంది. నేడు జరగనున్న సెమీఫైనల్ పోరులో సలీమా టిటే సేన జపాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టోర్నీకి ఆతిథ్యమిస్తోన్న భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచిం ది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయాలు అందుకుంది.
చివరి లీగ్ మ్యాచ్‌లో జపాన్‌ను చిత్తు చేసిన భారత్ సెమీస్‌లోనూ అదే జట్టుతో ఆడనుంది. టోర్నీలో టాప్ స్కోరర్‌గా కొనసాగుతు న్న దీపిక కుమారిపై మరోసారి మంచి అంచనాలుండగా.. వైస్‌కెప్టెన్ నవ్‌నీత్ కౌర్, బ్యూటీ డంగ్ డంగ్, షర్మిలా దేవి, సంగీతా, ప్రీతి దూబే, లాలారెమ్‌సియామిలు కీలకం కానున్నారు. కెప్టెన్ సలీమా యాంకర్ రోల్ ను సమర్థంగా పోషిస్తోంది.