12-08-2025 12:00:00 AM
క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి ఆగస్టు 11: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం లచ్చపురం గ్రామ సమీపంలోని డి82 కేఎల్‌ఐ కాల్వకు పడిన గండి దుండగుల పనేనని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అనుమానిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న అక్కస్సుతో గుర్తు తెలియని వ్యక్తులు నీటి పేరుతో కాలువలకు గండ్లు పెడుతున్నారని అలాంటివారిని గుర్తించి పీడియాట్ నమోదు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. సోమవారం గండిపడిన కేఎల్‌ఐ కాల్వతో పాటు వరద నీటితో నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. వెంటనే గండి పడిన కాల్వను పునరుద్ధరించాలని ఇరిగేషన్ శాఖ అధికారులనుఆదేశించారు.