19-07-2025 02:12:11 AM
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- కేశవ్ మెమోరియల్ వ్యవస్థాపక దినోత్సవం
- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్ నారాయణ గూడలో గల కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 85వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సమాచా ర ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరయ్యారు.
కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో, విద్యారంగంలో కేఎంఐటీ చేసిన విశేష కృషిని, దేశ స్వాతంత్య్ర పోరాటంలో సంస్థ పోషించిన కీలక పాత్రను మంత్రులు కొనియాడారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యా రంగంలో ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు సాంకేతిక రంగం లో చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు, పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.