calender_icon.png 24 September, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్‌ను విడుదల చేయాలి

24-09-2025 01:30:33 AM

  1. అక్టోబర్ 1 నుంచి కమిషనర్ కార్యాలయం ముందు నిరసన 

రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం 

ఖైరతాబాద్, సెప్టెంబర్ 23 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ ను ఈ నెల 30 లోపు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో అక్టోబర్ 1,2 వ తేదీలో పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ మేరకు మంగళ వారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17200 మంది రేషన్ డీలర్లు ఉన్నారని అన్నారు. ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ రాకపోవడంతో భవన కిరాయిలు, హెల్పర్ జీతాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారని తెలిపారు.

ఇట్టి విషయాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని వాపోయారు. రేషన్ డీలర్ల కమిషన్ ను ఈనెల 30 లోపు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షులు నాయి కోటి రాజు, ట్రెజరర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.