22-10-2025 01:04:43 AM
హైదరాబాద్, అక్టోబర్ 21: ఆర్‌ఆర్ కేబుల్ ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో సీజన్‌లో సెమీఫైనల్స్‌కు ముందు అహ్మదాబాద్ డిఫెండర్స్‌కు షాక్ తగిలింది.గచ్చిబౌలీ స్టేడియం వేదికగా జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్ అహ్మదాబాద్‌కు షాకిచ్చింది. ఇప్పటికే సీజన్ నుంచి నిష్క్రమించిన కొచ్చి 15 స్కోర్‌తో అహ్మదాబాద్‌పై గెలుపొందింది.
ఎరిన్ వర్గీస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అహ్మదాబాద్ మ్యాచ్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటకీ కొచ్చి స్పైకర్స్ పదునైన సర్వీసులకు సమాధానం చెప్పలేకపోయింది. సర్వీస్‌లో 24 పాయింట్లు సాధించగా..అహ్మదాబాద్ 17 పాయింట్లకే పరిమితమైంది.కాగా అహ్మదాబాద్ ఇప్పటికే సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై, బెంగళూరు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.