09-02-2025 10:29:39 PM
దర్శనానికి భారీగా హాజరైన భక్తులు..
పటాన్‌చెరు: తెలంగాణ కంచిగా ప్రసిద్ధి చెందిన కొడకంచి ఆదినారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ముఖ్య ఘట్టమైన రథోత్సవం శనివారం కను్నల పండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదినారాయణ స్వామి రథోత్సవంపై పురవీదుల్లో ఊరేగారు. ఈ వేడుకను కనులారా వీక్షించేందుకు వివిద ప్రాంతాల నుంచి భక్తుల అధికంగా హాజరయ్యారు. ఆదివారం ఆదినారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమేశ్ ఆదినారాయణ స్వామిని దర్శంచుకున్నారు. ఆలయ ట్రస్టీ ఫౌండర్ అల్లాణీ రామాజీరావు స్వాగతం పలికి సన్మానించారు. భాస్కర్, సాయిగౌడ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.