calender_icon.png 22 November, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణం

09-02-2025 10:31:55 PM

ప‌టాన్‌చెరు: బొల్లారం మున్సిపల్‌లో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవరోజైన ఆదివారం మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణంలో భక్తులు, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి మాట్లాడుతూ... మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా కళ్యాణానికి తరలివచ్చిన భక్తులకు, ధర్మకర్తలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, భ‌క్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.