17-08-2024 12:40:54 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాం తి): శాసనమండలిలోని తన చాంబర్‌లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి శుక్రవారం టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదం డరాం, పాత్రికేయుడు అమీర్ అలీఖాన్‌తో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో వీరు పదవులకు ఎన్నికయ్యారు. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పుతో..
బీఆర్‌ఎస్ నేతలైన దాసోజు శ్రావణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని 2023 జూలైలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి సిఫార్సు చేయగా ఆమె రద్దు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించి గవర్నర్ తమిళిసైకు సిఫారస్ చేయ గా ఆమె ఆమోదించారు. వీరి నియామకంపై దాసోజు శ్రావణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిపై సుప్రీం ధర్మాసనం తాజాగా స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్థానాల్లో కొత్త వారి భర్తీని నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
కొత్త నియామకాలను ఆపలేమని తేల్చి చెప్పడంతో కోదండరాం, అమీర్‌అలీఖాన్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ సందర్భంగా కోదండ రాం మాట్లాడుతూ.. ‘గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. నేను ఎమ్మెల్సీ కావడాన్ని ఉద్యమకారులు స్వాగతిస్తున్నారు. పదవిని నేను అదనపు బాధ్యతగానే భావిస్తున్నా’ అన్నారు. అమీర్ అలీఖాన్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తా. గవర్నర్ కోటాలో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు. ప్రధానంగా మైనార్టీ వర్గాలకూ ఈ ప్రభుత్వంలోనే ప్రాధాన్యం ఉంటుంది. ఈ అవకాశాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేస్తా’ అని అన్నారు.
పోరాటానికి దక్కిన గౌరవం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో జేఏసీ చైర్మన్‌గా, విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా ప్రొఫెసర్ కోదండరాం చేసిన పోరాటానికి, సేవలకు దక్కిన గౌరవమే పదవి అని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, తహసీల్దార్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.