30-12-2025 12:10:50 AM
విజయ్ హజారే ట్రోఫీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో మరో మ్యాచ్ ఆడబోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌లో ఆడి అదరగొట్టిన కోహ్లీ ఇప్పుడు మూడో రౌండ్ మ్యాచ్‌లకు రెడీ అయ్యాడు. అయితే న్యూజిలాండ్‌తో సిరీస్ జరగనున్న నేపథ్యంలో మరొక్క మ్యాచ్‌లో మాత్రమే విరాట్ బరిలోకి దిగుతాడు. జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఆడనున్నాడు.
2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ రోహిత్ శర్మ బీసీసీఐ సూచనతో దేశవాళీ క్రికెట్‌లోకి చాలా రోజుల తర్వాత అడుగుపెట్టారు. విరాట్ తన తొలి మ్యాచ్‌లో సెంచరీ , రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. వింటేజ్ కోహ్లీని గుర్తు చేస్తూ దుమ్మురేపాడు. అటు రోహిత్ శర్మ కూడా తొలి మ్యాచ్‌లో శతకం నమోదు చేశాడు.