calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్‌కతా అతలాకుతలం

24-09-2025 01:10:47 AM

-దసరా వేడుకల వేళ జడివాన

-జలదిగ్బంధంలో నగరం.. జనజీవనం అస్తవ్యస్తం

-వరదల్లో తొమ్మిది మంది గల్లంతు

కోల్‌కతా, సెప్టెంబర్ 23: పశ్చిమ బెంగాల్ రాజధాని నగరాన్ని వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి నుంచి మంగ ళవారం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. మూడు గంటల వ్యవధిలోనే 185 మి.మీ వర్షపాతం నమోదుకావడం గమనార్హం. నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మోకాళ్ల లోతు నీటిలోవాహన రాకపోకలు సాగాయి. కొన్నిచో ట్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. హౌరా, సీల్దా స్టేషన్లు నీట మునగడంతో రైల్వేశాఖ పలు సబర్బన్ రైళ్ల సేవలను పాక్షికంగా రద్దు చేసింది.

విమానాశ్రయ రన్‌వే పైకి వరద చేరడంతో 30కి పైగా విమాన సర్వీసులు రద్ద య్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల్లోకి వరద నీరు చేరింది. వరదల్లో తొమ్మిది మంది గల్లంతయ్యారు. దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ వర్షాలు కురవడంతో నగరవాసులకు నిరాశకు గుర య్యారు. కుండపోత వర్షాల కారణంగా కాళికామాత ఆలయంలో జరగాల్సిన అంకు ర్పారణ వేడుకలు రద్దయ్యాయి. ముఖ్యమం త్రి మమతా బెనర్జీ తన ఆలయ పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు నగరంలో వరదను మళ్లించేందుకు మున్సిపల్ అధికారులు అహర్నిశలు పనిచేస్తున్నారు. ముంపు ప్రాంతంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రా ష్ట్రంలో బుధవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.