24-09-2025 01:12:29 AM
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలు నేపథ్యంలోనే..
తిరువనంతపురం, సెప్టెంబర్ 23: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ విషయమై మంగళవారం కస్టమ్స్ అధికారులు కేరళవ్యాప్తంగా దాడు లు నిర్వహించారు. దీనిలో భాగంగానే కొచ్చిలోని మలయాళ ప్రఖ్యాత నటులు దుల్కర్ సుమన్, పృథ్వీరాజ్ నివాసాల్లోనూ సోదా చేశారు. దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లలోనూ సో దాలు చేపట్టారు. వీరి ఇళ్లలో ఎలాంటి లగ్జరీ వాహనాలను అధికారులు గుర్తించలేదని సమాచారం. ‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ పేరుతో కస్టమ్స్ అధికారులు కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా నటులు, పారిశ్రామిక వేత్తల ఇళ్లను సోదా చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా కొచ్చి, మలప్పురం, కోజికోడ్‌లో దాడులు చేపట్టారు.