24-05-2025 12:17:06 AM
నల్లగొండ టౌన్, మే23 : తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం నల్లగొండ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పిటిసి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వంగూరి లక్ష్మయ్య, పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.