calender_icon.png 28 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలపై ముందుకే..

28-09-2025 12:22:24 AM

-రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!

-జిల్లా స్థాయిలో జాబితాను ధృవీకరించి పంపాలి

-అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియపై ముందుకే వెళ్లాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం (ఎస్ ఈసీ) ఉన్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నిలకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.

దీంతోపాటు జిల్లా స్థాయిలో ఖరారైన రిజర్వేషన్ల జాబితాను ధృవీకరించి పంపాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ సారి స్థానిక ఎన్నికలను ఎస్‌ఈసీ రెండు దశల్లో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం అందించే రిజర్వేషన్ల ఆధారంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.