28-09-2025 12:21:50 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : మూసీ వరదలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సం బంధిత అధికారులను ఆదేశించారు. వర్షా లు, వరదల కారణంగా మూసీ పరీవాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్ధరాత్రి ఇమ్లీబన్ సమీపంలో ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ మూసీ వరద నీరు రావడంతో అక్కడున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేం దుకు చేపట్టిన సహాయక చర్యలను సీఎం స్వయంగా సమీక్షించారు. ఎప్పటికపుపడు అధికారులతో ఫోనులో మాట్లాడి ప్రయాణిలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్ల కు మళ్లించాలని ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుం డా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు.
వరుసగా రెండోరోజుకూడా హైదరా బాద్‌కు భారీ వర్ష సూచన ఉండటంతో పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలన్నారు. సిటీలో నీళ్లు నిలిచే, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సీఎం సూచించారు.