calender_icon.png 28 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం మరువలేనిది

28-09-2025 12:49:59 AM

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి) : తెలంగాణ స్వరాష్ర్ట ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపా రు. స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమ కారుడు, గాంధే యవాది, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. 

రేపటి తరాలు కొండా లక్ష్మణ్ బాపూజీ కృషిని గొప్పతనాన్ని గుర్తుంచుకునే దిశగా వారి పేరుతో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, రాష్ర్ట ఉద్యాన వన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని, వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని నెలకొల్పిందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన కృషిని ఆదర్శంగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలను నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. వాటిని కొనసాగిస్తూ, బీసీ వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయడమే వారికి మనమందించే ఘన నివాళి అని కేసీఆర్ స్పష్టం చేశారు.