02-12-2025 12:57:55 AM
మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే
కరింనగర్, డిసెంబర్1(విజయక్రాంతి):ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంది ఆదుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా కల్పించారు. సోమవారం తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్లో కలిసి కొండగట్టు అగ్ని ప్రమాద ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు.
అర్థరాత్రి మంటలు అంటుకొని దుకాణాలు కాలిపోయాయని, దుకాణాలను నమ్ముకొని జీవిస్తున్న వారు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం తరఫున అగ్ని ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు.
పరిహారం అందజేయడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అగ్ని ప్రమాద నివేదికను తయారుచేసి పంపించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పరిహారం మంజూర చేయాలని కోరగానే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలుతెలిపారు.