calender_icon.png 8 January, 2026 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

​శాతవాహన యూనివర్సిటీ లా విద్యార్థుల ఆందోళన

06-01-2026 07:48:01 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ లా విభాగంలో అటెండెన్స్ సాకుతో విద్యార్థులను పరీక్షలకు దూరం చేయడాన్ని నిరసిస్తూ లా విద్యార్థులు  ఉధృతంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లా విద్యార్థుల ప్రతినిధులు మాట్లాడుతూ... యూనివర్సిటీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇటీవల నవంబర్ 2025లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును విద్యార్థులు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటెండెన్స్ నిబంధనల పేరుతో విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడం సరికాదని, అది వారి ప్రాణాల మీదకు వచ్చేలా ఉండకూడదని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది.

ఈ జడ్జిమెంట్ కాపీని అధికారులకు వివరించినప్పటికీ, వారు పాత పద్ధతులనే అవలంబిస్తూ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. అదే విధంగా సమస్యను పరిష్కరించాలని కోరుతూ చర్చలకు వెళ్లిన విద్యార్థుల పట్ల లా ప్రిన్సిపాల్ పద్మావతి, ఓఎస్డీ  వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. చర్చల సమయంలో ప్రిన్సిపాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు విద్యార్థుల మనోభావాలను దెబ్బతీశాయని, ఇది విద్యార్థి-ఉపాధ్యాయుల మధ్య ఉండాల్సిన గౌరవాన్ని తగ్గించేలా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా లా విద్యార్థులందరూ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం అటెండెన్స్ ఉన్నవారికే పరీక్షలు నిర్వహిస్తామనే మొండి వైఖరి వీడి, విద్యార్థులందరినీ సమానంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. ​విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోని,​తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని శాతవాహన యూనివర్సిటీ లా ఈ  సందర్బంగా విద్యార్థులు స్పష్టం చేశారు.