calender_icon.png 8 January, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల కోసం వెల్నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డు

06-01-2026 08:06:18 PM

హెల్త్ కార్డు జారితో జర్నలిస్టులకు ఆరోగ్యానికి పూర్తి భరోసా

ఆనందాన్ని వ్యక్తం చేసిన జర్నలిస్టులు

నిజామాబాద్,(విజయక్రాంతి): జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యులు పూర్తి భరోసా ఇస్తూ హెల్త్ కార్డు జారీ చేస్తామనడం చాలా గొప్ప విషయమని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, డాక్టర్ వాగ్మారే సుభాష్ అన్నారు. మంగళవారం నగరంలోని వెల్నెస్ ఆస్పత్రి యాజమాన్యం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన కమిటీని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్  అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. ఆధునిక హంగులతో, అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వెల్నెస్ ఆస్పత్రి యజమాన్యులు ముందుకు రావడం జర్నలిస్ట్ మిత్రులందరికీ మంచి శుభ పరిణామం అని అన్నారు. ఈ వెల్నెస్ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు అందే విధంగా ఒక ప్రత్యేకమైన హెల్త్ కార్డు రూపంలో ముందుకు రావడం అభినందనీయమని వారన్నారు. వెల్నెస్ ఆస్పత్రి యజమాన్యం ఈ కార్డు ఒక ఆన్లైన్ ప్రక్రియ  రూపంలో జర్నలిస్టులకే కాకుండా జర్నలిస్టు తల్లి తండ్రికి, జర్నలిస్టు పిల్లలకు   ప్రతి ఒక్కరికి చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

అంతేకాకుండా ఉచిత హెల్త్ కార్డు ద్వారా లక్షల ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సలతో పాటు వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నందుకు ఈ కార్డు ఎంతో తోడ్పడుతుందన్నారు. జర్నలిస్టు మిత్రులు ఈ కార్డు వైద్య సేవలను సద్వినియోగం  చేసుకొని ఆస్పత్రి యజమాన్యులకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నారు. ఏ ఒక్క జర్నలిస్టు మిత్రుడు కూడా హెల్త్ కార్డు పట్ల ఆందోళన చందకుండా పూర్తి భరోసా కల్పించేందుకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని భరోసా ఇస్తున్నామన్నారు.

అనంతరం జర్నలిస్ట్ మిత్రుల కోసం వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యులు ఉచిత హెల్త్ కార్డు అందజేస్తున్నందుకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యుల తో పాటు జర్నలిస్ట్ పక్షాన వెల్నెస్ ఆస్పత్రి డైరెక్టర్లు, అసద్ ఖాన్, సుమన్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ఆంజనేయులు, సతీష్ గౌడ్, జెట్టి గోవిందరాజు, సందీప్ దేశ్ముఖ్, నరేందర్ స్వామి, ఈసీ సభ్యులు సితారే కృష్ణ, పొద్దుటూరు ప్రీతం రెడ్డి,  సీనియర్ జర్నలిస్టులు పాపా ఖాన్, నయీమ్ కమర్ బాయ్, మహమ్మద్ గౌస్ బాయ్, వెల్నెస్ ఆస్పత్రి మేనేజర్ వినోద్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.