calender_icon.png 8 January, 2026 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ

06-01-2026 08:25:20 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): నగరం లోని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ  హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ... సంక్రాంతి పండుగ సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ద్వారా సంస్థలో ఐక్యత, టీమ్ స్పిరిట్ నెలకొంటాయని, వినియోగదారులకు భీమాను అందజేయడమే కాకుండా సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు తీసుకెళ్ళుతున్న సంస్థకు అభినందనలు తెలిపారు.