01-07-2025 02:47:38 AM
సనత్ నగర్, జూన్ 30 : బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో కళ్యాణోత్సవంలో భాగంగా దేవస్థాన సిబ్బంది, ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అమ్మవారికి వస్త్రాలంకరణ చేపట్టారు. ఈ ఉత్సవానికి పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి వస్త్రాలంకరణలో పాల్గొనడం అదృ ష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు.
బోనాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. అనంతరం క్యూ లైన్‌లో ఉన్న భక్తులతో మాట్లాడి దర్శనానికి పడుతున్న సమయం గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఏ లోటు రాకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, సూపరింటెండెంట్, ట్రస్ట్ బోర్డు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు