calender_icon.png 1 July, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బీజేపీ.. బీసీల ద్రోహ పార్టీ

01-07-2025 02:47:29 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): రాష్ర్ట అధ్యక్ష పదవి  బీసీలకు ఇస్తామని ఊరించిన బీజేపీ.. చివరికు బీసీలను మోసం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాష్ర్టం లో అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తుం టే బీజేపీ మాత్రం అగ్రకులాల జపం చేస్తుందని మండిపడ్డారు.

సోమవారం తెలంగాణ సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తానన్న బీజేనీ, చివరికి ఫ్లోర్ లీడర్ పదవిని కూడా అగ్రకులాలకు కట్టబెట్టిందని విమర్శించారు. 42 శాతం బీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా, బీసీలకు రాష్ర్ట పగ్గాలు ఇవ్వకుండా బీజేపీ పచ్చి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.

పార్టీ అధ్యక్ష పదవికి ఆ పార్టీలో చాలా మంది బీసీలు అర్హులైనప్పటికీ బీసీలను మోసం చేశారన్నారు. బీజేపీ లో ఉన్న బీసీ నేతలు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్న వెంటనే  ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీల బలమేంటో త్వరలోనే బీజేపీకి రుచి చూపించి తగిన బుద్ధి చెబుతామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.