calender_icon.png 23 December, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి

23-12-2025 01:57:46 AM

పెద్దపల్లి ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందించే దిశగా అడుగులు

క్రైస్తవులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి, డిసెంబర్ 22(విజయ క్రాంతి): పట్టణంలోని రంగంపల్లి 10వ వార్డు లోని క్రిస్టియన్స్ స్మశాన వాటిక ప్రహరీ గోడ, మురికి కాలువ నిర్మాణం కోసం రూ. 52 లక్షల నిధులతో మున్సిపల్ కమిషనర్, స్థాని క నాయకులతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు శంఖుస్థాపన చేశారు. అనం తరం పెద్దపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ 27, 28వ వార్డులల్లో రూ.93.51 లక్షల రూ పాయలతో శ్రీనిక హాస్పిటల్ నుండి సుభాష్ నగర్ చౌరస్తా వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు సిసి డ్రైన్ నిర్మాణం ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ పరిశీలన చేసి పెద్దపల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ వద్ద రూ.2.95 కోట్లతో 1700 kL కేఎల్ సామర్థం గల ఆర్ సీసీ ELSR ఈఎల్ ఎస్ ఆర్ నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు చందపల్లి లోని డబల్ బెడ్ రూమ్ ల వద్ద రూ.103.00 లక్షలతో 500 కేఎల్ సామర్థ్యం గల నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పరిశీ లించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణ అభివృద్దె ద్వేయం గా పనిచేయడం జరుగుతుందని, అందులో భాగంగానే సోమవారం రంగంపల్లి లోని క్రిస్టియన్ స్మశాన వాటికకు రూ.52 లక్షల నిధులతో ప్రహరీ గోడ అలాగే మురికి కాలు వ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగిందని చీకురాయి రోడ్ వే డెల్పు సెంట్రల్ లైటింగ్ తో ఆధునికరించ డం తెనుగువాడ పెద్దమ్మ నగర్ నుండి పెద్ద కాలువ వరకు అవుసుల బావి నుండి చందపల్లి వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ పను లు పూర్తి కావస్తున్నాయని, సంక్రాతి వరకు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకీ తీసుకరావడనికి ప్రయత్నం చేయడం జరుగుతుందని, పట్టణంలోని కూరగాయల మార్కెట్ రానున్న అతి కొద్ది రోజుల్లో ప్రభు త్వ అనుమతులు రాగానే మార్కెట్ పనులు కూడా మొదలు పెడతామని అన్నారు.

అలా గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి పట్టణానికి మరో రూ. 63 కోట్లతో అలాగే రూ. 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, పట్టణంలో అన్ని వార్డుల్లో అవసరం ఉన్నచోట నిధులు ఉపయోగించి పట్ట ణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. అనంతరం ఇటీవల సుభాష్ నగర్ లో నిర్మించిన బీటీ రోడ్డు పనులను అలాగే స్థానిక ఆర్డిఓ ఆఫీస్ లో గల పాత వాటర్ ట్యాంక్ కూల్చివేత పనులను చందపల్లి డబల్ బెడ్ రూంల వద్ద నూతనంగా నిర్మిస్తున్న 500కేఎల్ సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమి షనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.