calender_icon.png 18 August, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

18-08-2025 12:00:00 AM

పాల్గొన్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్

ముషీరాబాద్, ఆగస్టు 17(విజయక్రాంతి): శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్  చిక్కడపల్లి, దోమల గూడ, కోఠి, గౌళిగూడలలో ఆదివారం   నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జన్మాష్టమి వేడుకల నిర్వాహకులు ఎ.వినయ్ కుమార్‌ను స్వాగతించి శాలువాతో ఘనంగా  సన్మానించారు. ఈ వేడుకల్లో బీజేపీ నేతలు ఆనంద్ రావు, నీరజ్, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, యాదవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.