24-07-2025 06:29:45 PM
రాజాపూర్: మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు మేకల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.