24-07-2025 07:35:28 PM
చిట్యాల (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) జన్మదిన వేడుకలను గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ముఖ్యఅతిథిగా మాజీ జడ్పిటిసి గొర్రె సాగర్ హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి,యూత్ అధ్యక్షుడు తౌటం నవీన్, ఏరుకొండ రాజేందర్, మడికొండ రవీందర్రావు, పిట్ట సురేష్ బాబు, నాయకులు పిట్టల రాజా మొగిలి, చిలుముల రమణాచారి, పెరుమండ్ల రవీందర్ గౌడ్, వీణవంక శ్రీదేవి, కరుణ తదితరులు పాల్గొన్నారు.