calender_icon.png 19 December, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వినతి

18-12-2025 04:28:50 PM

మంచిర్యాల (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు కలెక్టరేట్ కార్యాలయ ఏవో రాజేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ, రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యక్ట్ ఏర్పాటు చేయాలనీ, 50 శాతం సీలింగ్ రిజర్వేషన్ ఎత్తివేయాలనీ, EWS రిజర్వేషన్లు రద్దు చేయాలనీ, బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు అమలు చేయాలనీ, బీసీల్లో రోస్టర్ విధానాన్ని అమలు చేసి ఎస్సీ, ఎస్టీ లాగే బ్యాక్లాగ్ పోస్టులు బీసీ వర్గాలకు వర్తింపచేయాలనీ, అత్యాచార నిరోధక చట్టాన్ని బీసీలకు సైతం వర్తింపచేయాలనీ, జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, కాంట్రాక్టు పారిశ్రామిక రంగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బిపి మండల్ కమిషన్ సిఫార్సు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.

మా న్యాయమైన డిమాండ్లను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జెల్లి వెంకటయ్య, శాఖ పూరి భీమ్సేన్, వేముల అశోక్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, కొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.