28-07-2025 12:00:00 AM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల, జులై 27 (విజయక్రాంతి): ఆంధ్ర నాయకత్వం కంటే ఎక్కువగా కెసిఆర్ కుటుంబం దోచుకుతిన్నారు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఫామ్ హౌస్ లో జరిగిన పాపాలు కడుక్కోవడానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్నారు. మొరం దోపిడీ చేసిన పెద్ద దొంగ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మరెడ్డి.
ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చని బిఆర్‌ఎస్ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదు,దిగజారుడు రాజకీయాలతో దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నీ చెల్లెను లిక్కర్ కేసు నుండి విడిపించుకోవ డానికి బిఆర్‌ఎస్ పార్టీని బిజెపిలో విలనం చేస్తానని సీఎం రమేష్ ఇంటికి వెళ్లి చెప్పింది వాస్తవంకాదా, బిజెపి నాయకులు చేస్తున్న సవాలను స్వీకరించి నిరూపించుకో, ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా మిత్రుల సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడుతు న్నారు, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంట్రాక్టు పనుల కోసం దోపిడి వాస్తవం కాదా,సీఎంఆర్‌ఎఫ్ నిధులను దోచుకున్నది వాస్తవం కాదా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని కైటెక్స్ వారిని బ్లాక్ మెల్ చేసి 15 కోట్లు బి ఆర్ ఎస్ పార్టీ కోట్టి వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
కాళ్లకు చెప్పులు లేని అయ్యకు ఇన్ని వేల కోట్లు ఎక్కడ నుండి వచ్చాయి, అభివృద్ధి ముసుగులో రాష్ట్రాన్ని దోచుకుతున్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రోడ్డు తన కాంట్రాక్టు పనుల కోసం వెడల్పు పేరుతో ఇండ్లు కూల్చి రోడ్లు వేసి కోట్లు దోచుకున్నారు. గృహలక్ష్మి పథకం పేరుతో పేదలకు నిలువ నీడ లేకుండా చేసి, వారిని మోసం చేసింది వాస్తవం కాదా..? ఫామ్ హౌస్ లో జరిగిన పాపాలు కడుక్కోవడానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్నారు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోని సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి ఇబ్బంది గురి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి బిల్లులు ఇప్పిస్తున్నాం అన్నారు. అభయ హస్తం క్రింద మీరు దోచుకున్నది, మేము తిరిగి ఇచ్చాము, ఇప్పటి వరకు పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 6 కోట్ల పావుల వడ్డీ రుణాలు మహిళలకు ఇచ్చాము.ప్రతి నెలకు దాదాపు 6500 కోట్ల అప్పు కట్టుకుంటూ ఆరు గ్యారెంటీ హామీలను అంచెలంచెలుగా నెరవేరుస్తున్నాం.
అవినీతి రహిత పాలన మేము చేస్తున్నాం. గోదాం నుండి రాత్రి 11.30 గంటలకు యూరియాని దొంగిలించిన వారిని పోలీసులు కేసులు పెడితే తప్పా,బీసీల గురించి మాట్లాడే నైతికత మీకు లేదు, నీ పాలనలో బీసీ మంత్రిగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు కాదా..?, ఎన్నికల ముందు రైతు భరోసా ఎగగొడితే మేము ఇచ్చాం, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ పార్టీకి లేదు. ప్రగతి భవన్ సాక్షిగా రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్నారు,బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతు సబ్సిడీ రద్దు చేసారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీలు ఇస్తున్నాం అని అన్నారు.