22-11-2025 02:10:35 AM
అశ్వాపురం, నవంబర్ 21 (విజయక్రాంతి): మండలంలోని మొండికుంట గ్రామంలో పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం శుక్రవారం ముగిసి, మార్గశిర మాసం ఆరం భమైంది. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నెలరోజుల పాటు ప్రాతఃకాల పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడాయి. తెల్లవారుజామున గ్రా మస్తులంతా ప్రత్యక్షంగా హాజరై పూజల్లో పాల్గొనే అవకాశం లభించడం భగవంతుని అనుగ్రహంగా భావించారు.
దేవాలయం నిర్మాణం పూర్తయ్యిన తొలి సంవత్సరంలోనే కార్తీకమాసం మొత్తం ప్రతిరోజూ తొలిహారతి దర్శనం చేయడం గ్రామానికి శుభఫలితాలను అందిస్తుందని దేవాలయ పూజారి రాహుల్ తెలిపారు. గ్రామంలోని ప్రతి కుటుంబ అభివృద్ధి, ఆరోగ్యం, శాంతి కోసం నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. కార్తీకమాసం చివరి రోజు పూజారిదంపతులకు గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు శాలువాలు కప్పి ఘనంగాసత్కరించారు.