calender_icon.png 22 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో వార్డును ఎస్సీలకే కేటాయించాలి

22-11-2025 02:09:30 AM

ములకలపల్లి, నవంబర్ 21(విజయ క్రాంతి): ములకలపల్లి పంచాయతీలోని రెం డో వార్డును ఎస్సీలకు కేటాయించాలని కోరుతూ ఆ కాలనీవాసులు ఎంపీడీవో కా ర్యాలయ పర్యవేక్షకులు విజయరాజుకు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం కాలనీకి చెందిన కొట్టే శేషు తదితరులు ఇక్కడ మా ట్లాడుతూమండల కేంద్రంలోని ములకలపల్లి పంచాయతీలో 14 వార్డులు ఉన్నా యని వాటిలో రెండో వార్డు అంబేద్కర్ నగర్ తో పాటు 10వ వార్డులో ఎస్సీలు (మాదిగ, మాల) చెందినవారు మాత్రమే ఉ న్నారని ఎన్నికల నియమావళి లో భాగంగా పంచాయతీ సర్దుబాటులలో రెండో వార్డ్ ను ఎస్సీలకు మాత్రమే రిజర్వ్ చేయాలని వారు అధికారులను కోరారు. గత 20 సంవత్సరాల నుంచి వార్డులో కేవలం ఎస్సీలు మాత్రమే పోటీ చేస్తున్నారని అదే రిజర్వేషన్ ప్రకారం త్వరలో నిర్వహించబోయే గ్రామపంచాయతీ ఎన్నికలలో ములకలపల్లి పం చాయతీలోని రెండో వార్డును ఎస్సీలకు మాత్రమే కేటాయించాలని కోరారు.