calender_icon.png 22 November, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'పాకిస్తాన్ గత తప్పుల నుండి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు'

26-07-2024 10:50:08 AM

కార్గిల్ యుద్ధానికి సాక్షిగా లద్ధాఖ్ నిలుస్తోంది

సైనికుల పోరాటం నా మదిలో నిలిచిపోయింది

దేశంలో కోసం సైనికుల చేసిన త్యాగాలు చరిత్రలో నిలుస్తాయి

న్యూఢిల్లీ: పాకిస్థాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కార్గిల్ యుద్ధానికి సాక్షిగా లద్ధాఖ్ నిలుస్తోందన్నారు. జూలై 26న కార్గిల్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడీ 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా యుద్ధ వీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్గిల్‌లో జరిగిన సభలో పీఎం మోడీ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నామని ప్రధాని తెలిపారు. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయి, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని ఆయన పేర్కొన్నారు. సైనికుల త్యాగాలకు దేశం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుందని తెలిపారు. కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉన్నానని గుర్తుచేసుకున్నారు. దేశం కోసం సైనికులు చేసిన పోరాటం తన మదిలో నిలిచిపోయిందని మోడీ తెలిపారు. ప్రస్తుతం కాశ్మీర్ లో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నిలయంగా ఉందన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. మౌలిక సౌకర్యాలు, పర్యాటక రంగం వేగంగా పుంజుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.