calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ అరెస్టు తప్పదు

26-09-2025 01:22:50 AM

-బీఆర్‌ఎస్ నాలుగు ముక్కలైంది: పీసీసీ అధ్యక్షుడు మహేశఖకుమార్‌గౌడ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ అరెస్ట్  తప్పదని, అందుకు సంబంధించిన ఆధారాలన్ని ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్  అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే  గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చేసిందని, అందుకు కేసీఆర్, కేటీఆర్ వ్యూహ రచన చేశారని విమర్శించారు. తన ఫోన్‌తో పాటు సీఎం రేవంత్ రెడ్డిది కూడా గత రెండున్నరేళ్లు ట్యాప్ చేశారని, ఆ వివరాలు దొరికాయని మహేష్ కుమార్‌గౌడ్ చెప్పారు.

గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు అని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నిటి పైన సీబీఐ విచారణ జరిపితే బాగుటుందన్నారు. బీఆర్ ఎస్ నాలుగు ముక్కలు అయిందని, మళ్లీ కోలుకునే పరిస్థితి లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రెడ్డి సామాజికవర్గం అయినప్పటికీ బీసీ ల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారని మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు.

42 శాతం రిజర్వేషన్లపై త్వరలో తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చే అవకాశం ఉందని, జీవో ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని,  అన్ని సర్వేలు కూడా తామే ముందున్నామని చెబుతున్నాయన్నారు. గతంలో కంటో న్‌మెంట్ గెలిచామన్నారు. హైడ్రాతో సామాన్యుడికి ఇబ్బంది లేదని, కబ్జా చేసిన వారికి మాత్రమే హైడ్రా తో ఇబ్బందులున్నాయన్నారు. ప్రభుత్వ భూమి పోకుండా ఉండేలా హైడ్రా పని చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు హైడ్రా కూలగొట్టడానికి వెళ్లిందని, కానీ కోర్టు ఆర్డర్ స్థానికులు తీసుకురావడంతోనే ఆగిపోయిందన్నారు.