09-10-2025 12:00:00 AM
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
హనుమకొండ అక్టోబర్ 8 (విజయ క్రాంతి): గంజాయిని సరఫరా చేస్తున్న సుమారు రూ.20 లక్షల 50 వేల విలువ చేసే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను పక్క సమాచారంతో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వారిని విచారించగా వారు గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం రాను హుస్సేన్ తండ్రి పేరు అల్తాప్ హుస్సేన్, 33 సంవత్సరాల వయసు గల ముస్లిం,పెయింటింగ్ పనిచేసే వెస్ట్ బెంగాల్ రాష్ట్రము కు చెందిన వ్యక్తి గత నాలుగు నెలల క్రితం తన సొంత గ్రామం నుండి గంజాయి సప్లయ్ చేసే కృష్ణ చంద్ర బర్మన్,కోచ్ బేహార్ , వెస్ట్ బెంగాల్ అనే వ్యక్తి దగ్గర నుండి తన వద్ద ఉన్న డబ్బులతో గంజాయిని కొనుగోలు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూలీల అడ్డ వద్ద అమ్మేసరికి తనకు అధిక లాభం రావడంతో అట్టి డబ్బులను జల్సాలకు ఖర్చు చేసుకున్నాడని, ఇట్టి విషయాన్ని తన చిన్ననాటి స్నేహితుడు అయిన నూర్ మహమ్మద్ మియా, అనే వ్యక్తి కి తెలియజేసి ఇద్దరు కలిసి గంజాయి సరఫరా చేసి అమ్ముతే అధిక డబ్బులు సంపాదించవచ్చునని అనుకోని గత నెలలో చెరో ఒక లక్ష రూపాయలను రెడి చేసుకొని గంజా యి అమ్మే కృష్ణ చంద్ర బర్మన్ వద్ద రూ. 2 లక్షలతో మొత్తం 41 కిలోల గంజాయి ని కొనుగోలు చేసి లగేజ్ బ్యాగులలో ఎవ్వరికి అనుమానం రాకుండా ప్యాక్ చేసుకొని ఈనెల 4వ తారీఖున కోచ్ బేహార్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ కు వెళ్ళే రైలు ఎక్కి వస్తుండగా, వీరిద్దరూ పోలిస్ వారిని చూసి భయపడి ఈనెల ఆరవ తారీఖున మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుండి బస్సులో హనుమకొండ బస్ స్టేషన్ కు వచ్చి నిన్నటి రోజు హైవే లొకేషన్ చూసుకొని ముచ్చెర్ల క్రాస్ వద్ద దిగి సికింద్రాబాద్ కు వెళ్ళుటకు లారీలు అపే క్రమంలో వారిని పట్టుకొని అదుపులోకి తీసుకొని గంజాయి సిజ్ చేసినాము అన్నారు. వారి దగ్గర మూడు సెల్ ఫోన్స్ సీజ్ చేసి రిమాండ్ తరలించినాము అని తెలిపి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెడుతామని తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ ఎసిపి, కె యు ఇన్స్పెక్టర్ యస్ .రవికు మార్ ను, యస్.ఐ, ఎ.కళ్యాణ్ కుమార్ ను పెట్రోలింగ్ పోలీసులను అభినందించినారు.