calender_icon.png 9 October, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ విధానానికి లోబడే పొత్తులు

09-10-2025 12:00:00 AM

పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ, రాష్ట్ర కమిటీ సభ్యులు కనకయ్య

మణుగూరు, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : రాజకీయ విధానాలకి లోబడే స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తులు ఉంటాయని, బిజెపికి వ్యతిరేకంగా కలిసి వచ్చే ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో స్థానిక ఎన్ని కల అవగాహన కుదుర్చుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య వెల్లడించారు. బుధవారం  స్థానిక సిపిఎం కార్యాలయంలో దామల్ల వెంకన్న అధ్యక్షతన జరిగిన మండల కమిటీ శాఖ కార్యదర్శిల సమావేశంలో  వారు మాట్లాడారు.

గతంలో  కామ్రేడ్ కుంజ కృష్ణకుమారి ప్రజా ప్రతినిధిగా నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించారని,  ప్రజా సమస్యలపై ఆఖరి శ్వాస వరకు అలుపెరుగని పోరాటాలు నిర్వహించారనీ  కొనియాడారు.  మండలంలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికలలో నిజమైన, స్వచ్ఛమైన ప్రజా పాలన అందించేందుకు సిపిఎం కలిసి వచ్చే లౌకిక శక్తులను కలుపుకొని ముందుకెళుతుందన్నారు.

ఎవరితో పోతున్న లేకున్నా పార్టీ సంస్థ గతంగా బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థులను పోటీలో ఉంటారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో  మతతత్వ పార్టీలకు అవకాశం కల్పించ వద్దని  కోరారు. పార్టీ అభ్యర్థులు గెలిచిన చోట సుపరిపాలన గ్రామాభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఉంటుందన్నారు. అది సిపిఎం గెలిచిన చోట నిరూపించామని ఉద్ఘాటించారు.

ఈ సమావేశంలో  సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు, సీనియర్ నాయకులు కొడిశాల రాములు, మడి నరసింహారావు, పిట్టల నాగమణి, బొల్లం రాజు, తోట పద్మ,కుంజా రాజు,  నరసింహారావు,  శ్రావణ్ కుమార్, కోండ్రు గౌరీ, ములకల ఉత్తమ్, కారం భీమయ్య, తదితరులు పాల్గొన్నారు.