29-10-2024 01:21:21 AM
కామారెడ్డి ,అక్టోబర్ 28 (విజయక్రాంతి): కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలోని ఓ గోదాములో కొందరు పటాకులు నిల్వ ఉంచారని సమాచారం అందుకున్న దేవునిపల్లి ఎస్సై రాజు, అగ్నిమాపకశాఖ సిబ్బంది దాడులు నిర్వహించారు. గోదాములో పటాకులను నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. ఉన్నతాధికారుల అధికారుల ఆదేశాల మేరకు గోదామును సీజ్ చేశారు. ఇండ్ల మధ్య నిబంధనలకు విరుద్ధంగా పటాకులు నిల్వ ఉంచడం నేరమన్నారు. అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.