calender_icon.png 8 October, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం

08-10-2025 12:00:00 AM

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జల్.. జంగల్.. జమీన్.. అనే నినాదంతో ఆదివాసి గుండెల్లో గొప్ప పోరాటయోధుడిగా నిలిచిన వ్యక్తి, ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీం అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం కొమురం భీం వర్ధంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భీం చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. ఆదివాసు ల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఎమ్మెల్యే కొనియాడారు.

అదేవిదంగా బోథ్ మండల కేంద్రంలో రాజ్ గోండ్ సేవ సమితి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పం ద్రం శంకర్, రిటైర్డ్ ఉపాద్యాయులు, ఆదివాసీ పెద్దలు కొమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివాసి సమాజం కొరకు కొమురం భీం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. అలాగే సోనాల మండల కేంద్రంలో పార్టి(బి) రాయి సెంటర్ పెద్దల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, కొమురం భీం వర్ధంతిని జరుపుకు న్నారు. కొమురం భీం విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్, చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలకు  పూలమాలలు వేశారు. ఈ కార్యక్ర మంలో రాజ్ గోండ్ సేవ సమితి నాయకులు, తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం నాయకులు, రాయి సెంటర్ పెద్దలు, పెద్ద సంఖ్యలో ఆదివాసులు పాల్గొన్నారు.