22-11-2025 02:14:10 AM
మణుగూరు, నవంబర్ 21 (విజయ క్రాంతి) : ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2 లక్కీ క్రషర్ నుంచి బొగ్గు లోడింగ్ కోసం రాక పోకలు సాగించే లారీలు రోడ్డు భద్రత నిబంధనలు పాటించేలా సింగరేణి అధి కారులు చొరవ చూపాలని ఏరియా టీబీ జీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం ఆయన మాట్లాల డుతూ, క్రషర్ దగ్గరకు బొగ్గు లోడింగ్ కో సం వచ్చే లారీలు వేగ నియంత్రణ పాటిం చ కుండా అతి వేగంతో వాహనాలు నడు పుతున్నారని, రహదారి వెంబడి రాకపోక లు సాగించే కార్మికులు భయాందోళనకు గురి అవుతున్నారని తెలిపారు.
కార్మికు లు విధులకు హాజరయ్యే సమయాలలో బొగ్గు లారీలు రాకపోకలు సాగించడం ఇబ్బందిగా మారిందన్నారు. సెకండ్, నైట్ షిఫ్ట్ లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంద ని, ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2 నుంచి ప్రధాన చెక్ పోస్ట్ మధ్యలో అవసరానికి తగిన స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల లారీ ల వేగానికి నియంత్రణ లేకుండా పోతుం దన్నారు. కొన్ని లారీలు టర్భాలు కట్టకుం డానే బొగ్గు సరఫరా సాగించడంతో, రహ దారి వెంబడి విపరీతంగా బొగ్గు పెల్లలు పడి కార్మికులు దుమ్ము ధూళితో బాధప డుతున్నారని, విధుల రాకపోకలకు ఆ టంకంగా మారుతుందని పేర్కొన్నారు.
గ తంలో ప్రమాదాలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయని,ఫిట్ నెస్ లేని లారీలు లోడింగ్ కోసం వచ్చి రహదారి వెంబడి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయ ని చెప్పారు. రహదారి వెంబడి ఆగిన లా రీ ల డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించ కుండా ఇష్టానుసారంగా వదిలి పోవడం తో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి స మయాలలో రహదారి వెంబడి బొగ్గు లారీ నిలిచిపోతే హెచ్చరిక లైట్లు, సరైనా రిఫ్లెక్టే డ్ స్టిక్కర్ లతో కూడిన బోర్డ్ లు లారీ ముందు, వెనుక వరుసలో ఉంచవలసిన లారీ డ్రైవర్లు కనీస నిబంధనలు పాటించ కుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డా రు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్ర త్యేక దృష్టి సారించి లారీల యజమాను లు,డ్రైవర్ లకు రోడ్డు భద్రత అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి ప్రమాదాల బారి నుంచి కార్మికులను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.