18-10-2025 07:46:13 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి లోని ఫిర్జాదిగూడ మున్సిపల్ పరిధి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో దీపావళి వేడుకలను బోధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దీపాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎల్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని బోధిఫౌండేషన్ అందించిన దీపాలు స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమంఅని విద్యార్థులు ఎంతో సంతోషంగా స్వీకరించి, ఆనందం వ్యక్తం చేశారు అన్నారు.