calender_icon.png 31 October, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో నిధులు

31-10-2025 01:11:04 AM

మెదక్ టౌన్, అక్టోబర్ 30 :జిల్లాలోని మున్సిపాలిటీల్లో నిధుల కొరత ఉన్నటువంటి తరుణంలో అత్యవసర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను కేటాయించింది. దీంతో యుఐడీఎఫ్ కింద పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం లభించింది. దాంట్లో భాగంగా మెదక్ మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి రూ.15 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు అధికారులకు పంపారు.

మెదక్ పట్టణంలో ఉన్న పెండింగ్ పనులు, సుందరీకరణ పనులు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన, మెదక్ మున్సిపాలిటీ గ్రేడ్-2 మున్సిపాలిటీ కిందకు రావడంతో మిగతా పురపాలికల కన్నా అధికంగా రూ.18.70 కోట్ల నిధులు మంజూరైనట్లు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితెలిపారు. ఇందుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు విశేష కృషి ఫలితంగానే ఈ నిధులు మంజూరయ్యాయనితెలిపారు.