calender_icon.png 23 December, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొట్టపగిలేలా నవ్వుల నారి నారి నడుమ మురారి

23-12-2025 12:00:00 AM

చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యాన్ప రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య మహిళా కథానాయికలుగా నటించారు. మేకర్స్ ఇప్పుడు సినిమా టీజర్ను లాంచ్ చేశారు. కథ శర్వా పాత్ర చుట్టూ తిరుగుతుంది, అతను ప్రేమలో పడతాడు, తన గర్ల్ ఫ్రెండ్ తండ్రిని వారి వివాహానికి ఆమోదించమని ఒప్పిస్తాడు.

అంతా సజావుగా జరుగతున్న సమయంలో, అతని మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా ఆఫీస్ లోకి రావడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. తరువాత జరిగే హ్యుమరస్ సంఘటనలు ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న శర్వా పాత్ర.. వినోదాత్మక కథనం ఆకట్టుకున్నాయి. శర్వా పాస్ట్  ప్రెజెంట్ లవ్ మధ్య ఇరుక్కున్న క్యారెక్టర్ లో అద్భుతమైన కామిక్ టైమింగ్తో మెప్పించారు. ఫ్లాష్బ్యాక్ సన్నివేశాల్లో ఎనర్జీతో నిండిన లుక్లో కనిపిస్తే, ప్రస్తుత కాలంలో క్లాస్, చార్మ్ను అద్భుతంగా కనబరిచారు.

ప్రజెంట్ లవ్ గా సాక్షి వైద్య, మాజీ లవర్ గా సంయుక్త నటించారు. ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేస్తూ ఆకట్టుకున్నారు. నరేష్ తనదైన స్టైల్ కామెడీతో సినిమాకు పెద్ద ప్లస్ అయ్యారు. సత్య, సునీల్, సుదర్శన్ లాంటి సహాయ నటులు హాస్యాన్ని మరింత పెంచుతూ వినోదాన్ని అందించారు. సినిమాటోగ్రాఫర్లు జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ సినిమాను రిచ్ విజువల్స్ తో ప్రజెంట్ చేశారు. కేరళ బ్యాక్డ్రాప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ విజువల్ గ్రాండ్యూర్ను పెంచాయి.

విశాల్ చంద్ర శేఖర్ అందించిన లైవ్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథనానికి తోడ్పడుతూ ఎంటర్టైన్మెంట్ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది. ప్రొడక్షన్ విల్యూస్ కూడా గ్లోసీగా, గ్రాండ్గా ఉన్నాయి. భాను బొగవరపు కథను అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాశారు. ఆర్ట్ డైరెక్షన్ బ్రహ్మ కడలి నిర్వహించారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిశోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మొత్తంగా ఈ టీజర్, యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను సమానంగా ఆకట్టుకునే ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్కు పునాది వేసింది.

హాస్యం, భావోద్వేగం, డ్రామా అన్నింటినీ సమపాళ్లలో కలిపిన సినిమాని ప్రామిస్ చేస్తోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీన సాయంత్రం 5:49 గంటలకు ఫస్ట్ షోతో థియేటర్లలో విడుదల కానుంది. సి.ఎమ్.ఆర్. ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శర్వా మాట్లాడుతూ.. అందరికీ హాయ్. మనం అనుకున్నది సాధించే శక్తి మన అందరిలో ఉంటుంది. ఎవరి ఒపీనియన్స్ పై ఆధారపడకండి.

ఎందుకంటే మన లైఫ్ ని మనమే బ్రతకాలి. కష్టపడి చదవండి. భయపడకండి. అనుకున్నది సాధించండి. ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఒకటే విషయం చెప్తాను. సినిమా పొట్టపగిలి నవ్వేలా వుంటుంది. జనవరి 14న రిలీజ్ అవుతుంది. 5:49 ఫస్ట్ షో. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు.