calender_icon.png 23 December, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంపియన్‌తో 100% హిట్ కొడుతున్నాం

23-12-2025 12:00:00 AM

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ’ఛాంపియన్’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్సో్త కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో ఛాంపియన్ నైట్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో రోషన్ మాట్లాడుతూ.. ‘అమ్మ నాన్న కష్టాన్ని నమ్ముకో అని నేర్పించారు. అలాగే దేని మీద కష్టపడతామో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మూడేళ్లు ఒక ప్రాజెక్ట్ కోసం ఆగాను అంటే అది కేవలం ఛాంపియన్ కోసమే. నేను ఇంకా ఏదైనా మంచి ప్రాజెక్టు వస్తే దానికి ఏదైనా ఇవ్వడానికి రెడీ. నేను సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు, కానీ చేసిన ప్రతి సినిమా 100% ఇచ్చానని మీతో అనిపించుకునేలా చేస్తాను. మీ నమ్మకమే నా రియల్ సక్సెస్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థాంక్యూ సో మచ్’ అన్నారు.

హీరోయిన్ అనస్వర మాట్లాడుతూ... హలో విశాఖపట్నం. విశాఖపట్నం నాకు ఎంతగానో నచ్చింది. డిసెంబర్ 25న ఛాంపియన్ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా ఇది. డైరెక్టర్ ప్రదీప్ గారికి థాంక్యూ. స్వప్న గారు ప్రియాంక గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. స్వప్న సినిమాస్ వైజయంతి మూవీస్ లాంటి లెజెండ్రీ బ్యానర్లో నేను తెలుగులో లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను.

గిరగిర సాంగ్ నా కెరీర్లో గుర్తుండిపోతుంది. మా టీంలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రోషన్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. డిసెంబర్ 25 తర్వాత రోషన్ ని అందరూ ప్రేమిస్తారు. తను కచ్చితంగా చాంపియన్ అవుతారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు చంద్రకళ. ఎప్పటిలాగే మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఈవెంట్‌లో సింగర్ రామ్ మిరియాల, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, నటులు చ్చ రవి, ఊహ, మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.