calender_icon.png 9 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి

09-01-2026 12:36:12 AM

  1. రూ.20వేల కోట్లతో గ్రీన్ ఫీల్ హైవే పనులు

నల్గొండను మోడల్ టౌన్‌గా మార్చుతా

నల్గొండ టౌన్, జనవరి 8: రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రహదారులు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గురువారం నల్గొండ పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు మేలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో నల్గొండ కార్పొరేషన్ కు కొత్త మేయర్ ఎన్నిక కానున్నారని కార్పొరేషన్ గా మార్చినందుకు మంత్రులకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా రూ.60 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, 20వేల కోట్లతో గ్రీన్ ఫీల్ హైవే పనుల ప్రణాళిక నడుస్తున్నదని, మన్ననూరు- శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వంటి వాటిని చేపట్టడం జరిగిందని వెల్లడించారు. రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని, అలాగే బ్రహ్మంగారి గుట్ట వద్ద అభివృద్ధి పనులు చేస్తున్నామని, భవిష్యత్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా చేయాలన్నదే తన సంకల్పమన్నారు.

కార్పొరేషన్ కావడంతో నల్గొండకు రాష్ట్ర ప్రభుత్వం నుండే కాకుండా కేంద్రం ద్వారా నిధులు వస్తాయని, నల్గొండ టౌన్ ను మోడల్ టౌన్ గా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. రూ.27 కోట్లతో సెంట్రల్ లైటింగ్ పనులు సైతం పూర్తి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో నల్గొండ పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. అంతకుముందు అన్నేశ్వర గుట్ట వద్ద అమృత్-2 పథకం కింద కోటి నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 1100 కిలో లీటర్ల తాగునీటి ట్యాంకును ప్రారంభించారు.

మూడు కోట్ల 14 లక్షల 60000 వ్యయంతో వల్లభరావు చెరువు సుందరీ కరణ పనులకు శంకుస్థాపన చేశారు. లెప్రసీ కాలనీలో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.లతీఫ్ సాబ్ గుట్ట సమీపంలో 50 లక్షల రూపాయల టి ఏ టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో నిర్మించిన ఎస్ ఈ-2 యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 68.83 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరించనున్న మోతికుంట పనులకు శంకుస్థాపన చేశారు. లెప్రసి కాలనీ వద్ద ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి కాంపౌండ్ వాల్ మంజూరు చేశారు.

మోతికుంట అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి భవనానికి కలర్లు,ఫ్యాన్,బొమ్మలు మంజూరు చేశారు. నల్గొండ మండలం దొనకల్ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బాగోని రమేష్ గౌడ్, ప్రజారోగ్య పర్యవేక్షక ఇంజనీర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, నల్గొండ మండలం మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.