calender_icon.png 14 November, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదులపై దాడిని నిరసిస్తూ లాయర్ల ఆందోళన

14-11-2025 01:44:00 AM

విధుల బహిష్కరణతో నిరసన 

మణుగూరు, నవంబర్ 13 (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెషన్స్ కోర్టులో కక్షిదారున్ని ప్రవేశ పెడుతున్న క్ర మంలో న్యాయవాది అనిల్ పై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ మణుగూరు బా ర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదు లు గురువారం ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో న్యాయ వాదులు తమ విధులు బహిష్కరించి,ప్రధాన ద్వారం ముం దు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి ధర్నా ని ర్వహించారు.

న్యాయావాదులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, అటువం టి దాడుల జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుచొరవచూపాలని బార్ అసోసియేష న్ అధ్యక్షుడు బద్దం శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ, నిత్యం న్యాయం కోసం పరితపించే న్యాయవాదులపై పోలీస్ లు దాడి చేయడం దారుణమన్నారు. న్యాయవాదిపై దాడి జరగడం అనేది న్యాయవ్యవస్థ గౌరవా న్ని, కోర్టుల అధికారం పట్ల చేసిన దారుణమైన సవాలుగా భావిస్తు న్నామన్నారు.

ఇటీ వల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల పై దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని దాడికి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసు కోవాలని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టం ను తక్షణం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో న్యాయవాదులు మేదరమెట్ల శ్రీనివాస్, చి ర్రా రవి, అశోక్, గొడుగునూరి నాగార్జున రె డ్డి, నగేష్, దాసరి కవిత, చిర్రా సరస్వతి , సావిత్రి, మధు పాల్గొన్నారు.