calender_icon.png 11 May, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగ పత్రిష్ట చేసి మొక్కు తీర్చుకున్న మైనం పల్లి

11-05-2025 12:21:33 AM

ఘనంగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 

గజ్వేల్:  గజ్వేల్ మండలం దిలాల్పూర్ లోని స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో శనివారం మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా నాగ ప్రతిష్ట చేశారు. గత ఏడాది లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఆలయ ప్రాంగణంలో నాగ ప్రతిష్ట చేసి మొక్కు తీర్చుకున్నారు.

కాగా గత రెండు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో తిరుమల రఘునాథ చార్యులు వైదిక నిర్వహణలో ప్రతిరోజు ఆలయంలో పురుష సూక్త సహిత మూలమంత్ర హవనములు నిర్వహిస్తున్నారు.   ఆదివారం సుదర్శన హోమం, లక్ష్మీ నరసింహ స్వామికి శతఘటాభిషేకం, చక్ర స్నానం అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి పుష్ప రథోత్సవం ఘనంగా జరగనుంది.   ఆదివారం జయంతిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బురుజు కింది సంతోష్ రెడ్డి, కోశాధికారి అత్తెల్లి  రాజేశం గుప్త, కార్యదర్శి రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.