11-05-2025 12:16:04 AM
జిల్లా ఉపాధ్యక్షుడు నంబి భరణి కుమార్
హుజురాబాద్,(విజయక్రాంతి): జర్నలిస్ట్ ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని టియుడబ్ల్యూజెయు జిల్లా ఉపాధ్యక్షులు నమ్మిని భరణి కుమార్, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామిని రవీందర్ లు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శనివారం ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛను హరించడం సరైనది కాదని సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటి పై ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ప్రత్యేక పత్ర పోషిస్తుందని, ఎలాంటి సెర్చ్ వారంటే లేకుండా సాక్షి ఎడిటర్ ఇంటిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత్రికేయులపై దాడులు మానుకోవాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, చిలకమర్రి సత్యరాజ్, ముష్కి శ్రీనివాస్, చందు, పడాల రమేష్, శ్రీధర్, రాజలింగం, మంతిని కిరణ్ బాబు, సాగర్, ఫహీం, రాజ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొ